ఎన్నికలకు సహకరించాలి
ఎస్పీ శ్రీనివాస్‌రావు
చిన్నశంకరంపేట(మెదక్): గ్రామపంచాయతీ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. సోమవారం చిన్నశంకరంపేట ఎంపీపీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని 492 గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తుకు చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో అందరం ఎల్లప్పుడు కలిసి ఉంటామని గుర్తుంచుకుని స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా తూప్రాన్ డీఎస్పీ శ్రీనివాస్‌రావు, రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్, ఎస్‌ఐ నారాయణగౌడ్‌కు పలు సూచనలు చేశారు.


