పొలం బడిని సద్వినియోగం చేసుకోవాలి
సస్యరక్షణ కేంద్రం అధికారి ఉదయ్‌శంకర్
చిలప్‌చెడ్(నర్సాపూర్): వ్యవసాయంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే పొలం బడి ముఖ్య ఉద్దేశమని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సస్యరక్షణ కేంద్రం అధికారి ఉదయ్‌శంకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన చిలప్‌చెడ్ రైతువేదికలో రైతుల ఆధ్వర్యంలో పొలం బడిని ప్రారంభించి, రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలంబడి రైతులకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించి, ఉత్పత్తిని పెంచుతుందన్నారు. మిత్ర పురుగులు, లింగాకర్షక బుట్ట లు, ఎన్‌ఎస్‌పీపీ మొబైల్ యాప్స్ వంటి అనేక విషయాల గురించి విస్తరించి, వాటిపై విపులంగా అవగాహన కల్పిస్తామన్నారు. వారంలో ఒక రోజు నిర్వహించే పొలం బడి కార్యక్రమానికి ప్రతి రైతు హాజరవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సస్యరక్షణ కేంద్రం సిబ్బంది హోన్నప్పగౌడ, మండల వ్యవసాయాధికారి రాజశేఖర్‌గౌడ్, ఏఈఓలు అనిత, కృష్ణవేణి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


