మహిళదే పైచేయి
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● పంచాయతీపోరులో పెరగనున్న ప్రాతినిధ్యం
● జనరల్ స్థానాలకు సైతం అవకాశం
సంగారెడ్డి జోన్: జిల్లాలో గ్రామపంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థుల గెలుపు ఓటములతోపాటు ప్రాతినిధ్యం వహించడంలోనూ మహిళలే కీలకంగా మారుతున్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మహిళలకే అగ్రపీఠం దక్కనుంది. చాలా గ్రామపంచాయతీల్లో మహిళలు ప్రజాప్రతినిధులుగా మారి పాలించే అవకాశం కలగనుంది. మహిళలకు కేటాయించిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో సైతం వారు పోటీ చేసే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు, 5,370 వార్డు స్థానాలు ఉండగా 283 సర్పంచ్, 2,404 వార్డు స్థానాలను మహిళలకు కేటాయించారు. వీటితో పాటు జనరల్ స్థానాలలో సైతం మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. 0
50% వరకు రిజర్వేషన్లు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులకు 50% వరకు మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. ఓట్ల పరంగానే కాకుండా సీట్లలో కూడా మహిళలే ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో ఆందోల్, ఖేడ్, నర్సాపూర్, పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలున్నాయి. ఖేడ్ మినహా అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈ మేరకు జిల్లాలో 7,44,157 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళలు 3,75,843 ఉండగా పురుషులు 3,68,270 మంది ఓటర్లు ఉన్నారు. 7,500కు పైగా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలే కాకుండా శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో సైతం మహిళలే గెలుపోటములు నిర్ణయించనున్నారు.
మహిళదే పైచేయి
మహిళదే పైచేయి


