పర్యావరణహితానికి పాటుపడాలి
ఎంపీ రఘునందన్‌రావు
కంది(సంగారెడ్డి): వాసవీ క్లబ్ ద్వారా అనేక సామాజిక సేవలను అందించడం అభినందనీయమని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్‌రహిత వ్యాపారాన్ని చేయడం ద్వారా పర్యావరణహితానికి కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండలకేంద్రమైన కందిలో క్లబ్ జిల్లా గవర్నర్ ఇరుకుల్ల ప్రదీప్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన స్వదీపోత్సవంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ...వాసవీక్లబ్ కేవలం తమ వారికే కాకుండా సమాజం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అభినందించారు. వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ వాసవీ క్లబ్ కు తనవంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తానన్నారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి మాట్లాడుతూ..వ్యాపారస్తులు కేవలం డబ్బు సంపాదనకే ప్రాముఖ్యత ఇస్తారని అనుకోవడం సరికాదని క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ, పాఠశాలలకు బల్లలు ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్,వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్య ప్రకాశరావు, తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, కెమిస్ట్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల సంతోష్ కుమార్, సభ్యులు చందు గుప్తా,నరేందర్, పుట్నాల లక్ష్మణ్, కటకం శ్రీనివాస్, శ్రీరాం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


