● ఆకట్టుకున్న బండి షిడి
ఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. ముఖ్యంగా జాతర సందర్భంగా నిర్వహించిన బండి షిడి ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. దైవభక్తితో పొడవాటి కర్రతో భక్తుడి కాలు చివరన కట్టి వేలాడదీసి దేవాలయం చుట్టూ తిప్పడమే షిడి ప్రదర్శన. షిడికి కట్టిన భక్తుడు చేతిలో కర్ర పట్టుకుని మరో చేతితో భక్తులపై కుంకుమ, పసుపును చల్లుతుంటాడు. బండి షిడి వీక్షించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కాగా, మల్లన్న జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొని మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. – నారాయణఖేడ్


