గుర్రంపై వచ్చి.. నామినేషన్ వేసి
వట్‌పల్లి(అందోల్): అందోల్ మండలం తాడ్మన్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పట్లోళ్ల వీరారెడ్డి ఆదివారం గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. రెండవ విడతగా జరుగనున్న ఎన్నికలకు సంబంధించి మొదటిరోజు నామినేషన్‌ను అక్సాన్‌పల్లి క్లస్టర్‌లో దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్ కోసం రెండు గుర్రాలను రూ.20వేలు వెచ్చించి తీసుకువచ్చారు. తాడ్మన్నూర్ గ్రామం నుంచి అక్సాన్‌పల్లి క్లస్టర్ వరకు వందలాది మంది కార్యకర్తలుతో ఊరేగింపుగా వచ్చి నామినేషన్‌ను సమర్పించారు.


