సకాలంలో విదేశానికి జనరేటర్
రామచంద్రాపురం(పటాన్‌చెరు): బీహెచ్‌ఈఎల్ రామచంద్రాపురం యూనిట్‌లో తయారైన ఎయిర్ కూల్డ్ జనరేటర్‌ను విదేశాలకు పంపించారు. శనివారం భెల్ ఈడి వై.శ్రీనివాసరావు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బోట్స్వానా దేశంలోని జిందాలు మమాబులా ఎనర్జీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఈ ఆర్డర్‌ను డూసాన్ స్కోడా సంస్థ 14నెలల్లో అందించాలని సూచించిందని తెలిపారు. భెల్ యాజమాన్యం సకాలంలో నాణ్యమైన ఎయిర్ కూల్డ్ జనరేటర్‌ను విజయవంతంగా తయారు చేసి పంపించినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు విజయానికి కృషి చేసిన అధికారులు, కార్మికులను ఆయన అభినందించారు.


