గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు
సంగారెడ్డి టౌన్: గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంగారెడ్డి మొదటి క్లాస్ అడిషనల్ సెషన్ కోర్టు న్యాయమూర్తి జయంతి చెప్పారు. మెదక్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరి కిషన్ కథనం ప్రకారం.. 2021 ఫిబ్రవరిలో 102 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా.. జహీరాబాద్ ఎకై ్సజ్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ హెచ్‌ఏ మోహన్‌కుమార్ రమేష్ రెడ్డి గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసును జహీరాబాద్ ఎకై ్సజ్ స్టేషన్‌లో ఎస్‌ఐ ఎంటి కుమార్ కేసు నమోదు చేశారని డీసీ తెలిపారు. ఈ కేసులో సంగారెడ్డి జిల్లా కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి జయంతి.. రాథోడ్ మోహ్, రాథోడ్ వెంకట్, కేతావత్ పాండు నాయక్, రాథోడ్ మోతిరాంలకు పది సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.లక్ష చొప్పున జరిమాన విధించారు.
మరో నిందితుడికి ఐదేళ్ల జైలు
ఒడిశా నుంచి ఐదు కిలోల గంజాయిని అక్రమ రవాణా చేసిన సరజిత బిశ్వాస్ (36) అదే రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన నిందితుడికి సంగారెడ్డి మొదటి క్లాస్ అడిషనల్ సెషన్ కోర్టు న్యాయమూర్తి జయంతి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా శుక్రవారం విధించారు. 2019లో ఒడిశా నుంచి గంజాయిని సంగారెడ్డిలో అమ్మకానికి తీసుకొచ్చిన బిశ్వాస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై హెచ్‌ఏ మోహన్‌న్‌కుమార్ పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. సంగారెడ్డిలో రెండు కేసుల్లో ఐదుగురికి శిక్షలు పడడానికి కృషి చేసిన ఎకై ్సజ్ సిబ్బందిని మెదక్ డిప్యూటీ కమిషనర్ జె.హరి కిషన్‌న్, ఈఎస్ శ్రీనివాసరావులు అభినందించారు.


