చోరీ నిందితుడు అరెస్టు
తూప్రాన్: రెండు రోజుల క్రితం తాళం వేసిన ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ రంగాకృష్ణ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని నర్సాపూర్ బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఓ యువకుడు పారిపోయేందుకు యత్నించాడు. వెంబడించి పట్టుకొని విచారించగా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంటకు చెందిన కట్ట నవీన్ (26)గా తెలిసిందన్నారు. పెయింటర్‌గా నవీన్ ఈనెల 25న తూప్రాన్ పట్టణ కేంద్రంలో తాళం వేసిన మహ్మద్ అస్రఫ్ అలీ ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు చెప్పాడు. నిందితుడి వద్ద ఏడు తులాల బంగారు ఆభరణాలు, 37 తులాల వెండి, విలువైన రెండు చేతి గడియరాలు, రూ. 20 వేల నగదును నిందితుడి నుంచి రికవరీ చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ శివానందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
చోరీ నిందితుడు అరెస్టు


