ప్రాణం తీసిన ధాన్యం కుప్ప
చిన్నకోడూరు(సిద్దిపేట): రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్ౖప రైతు ప్రాణం తీసింది. చీకట్లో బైక్ ధాన్యం కుప్పపైకి ఎక్కగా అదుపుతప్పి కింద పడిపోయాడు. బలమైన గాయాలు కావడంతో రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గంగాపూర్ శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు...రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువారిపల్లెకు చెందిన వంచ రవీందర్ రెడ్డి(45) శుక్రవారం ఉదయం బైక్ మీద పని నిమిత్తం సిద్దిపేటకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో గంగాపూర్ వద్ద రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పలపైకి బైక్ ఎక్కి కిందపడిపోయాడు. పక్కనే ఉన్న బండరాళ్లపై పడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సైఫ్ అలీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టగం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య సుప్రియ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
బైక్‌పై నుండి పడి రైతు మృతి


