సమస్యల పరిష్కారానికి కృషి
సదాశివపేట(సంగారెడ్డి): ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం చూపుతానని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని 11వ వార్డులో రూ.10 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎంపీ ప్రారంభించారు. అనంతరం పెద్దమఠం సందర్శించి జగద్గురువు గది, మఠం నిర్మాణ భవనాన్ని పరిశీలించారు. అయితే పురాతనమైన మఠం నిర్మాణం శిఽథిలావస్థకు చేరడంతో మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేయాలని మఠం నిర్వాహకులు మఠం లింగానందస్వామి ఎంపీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం మఠం తరపున ఎంపీ రఘునందన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శివాజీ, మాజీ కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, బీజేపీ నాయకులు దేశ్‌పాండే, మాణిక్‌రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట చంద్రశేఖర్, పట్టణ బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఉపాధ్యక్షులు సతీష్, సంగమేశ్వర్, సాంబశివ, నవీన్‌కుమార్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు


