అధిక సాంద్రత పత్తి సాగుపై క్షేత్ర ప్రదర్శన
వట్‌పల్లి(అందోల్): మండల పరిధిలోని చింతకుంటలో గురువారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సంగుపేట్ ఆధ్వర్యంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట సాగుపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సాంద్రత పద్ధతిలో వేసిన పత్తి పంటపై రైతులతో రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ మాట్లాడారు. సాధారణ పత్తి కంటే ఈ అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతిలో సాగు చేస్తే మేలైన దిగుబడితో పాటు తక్కువ పంటకాలంతో పంట తొందరగా చేతికి వస్తుందన్నారు. అనంతరం సహాయ వ్యవసాయ సంచాలకులు రామాదేవి మాట్లాడుతూ అధిక సాంద్రత పద్ధతిలో రైతులు మొదటి పంట పూర్తికాగానే రెండవ పంట విత్తుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్–2 రేఖా మనోజ్, యంగ్ ప్రొఫెషనల్–1 ఎస్. శ్రీకాంత్, కె.ఆకాష్, వేద సీడ్స్ మార్కెటింగ్ మేనేజర్ బాలాజీ, రైతులు తమ్మలి రాములు, సీతారాల మల్లేశం, పుట్టి మల్లేశం, కొత్తపల్లి దుర్గయ్య, వెంకయ్య, ఒగ్గు లక్ష్మయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.


