ఆధ్యాత్మికతతో పరిపూర్ణమైన శాంతి
● టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్
● శ్రీరాంపూర్‌లో దుర్గమ్మ ఆలయానికి భూమిపూజ
ములుగు(గజ్వేల్): ఆధ్యాత్మిక మార్గం శాంతియుత జీవనానికి దోహదపడుతుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ములుగు మండలం శ్రీరాంపూర్‌లో బుధవారం దుర్గమ్మ నూతన ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికత వైపు మరలినప్పుడే శాంతిని, భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలుగుతారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌గుప్తా, డైరెక్టర్ శ్రీనివాస్, నాయకులు దేవేందర్‌రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.


