దేశ ఐక్యతకు పాటుపడాలి
జహీరాబాద్ టౌన్: దేశాభివృద్ధి, ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని డీఎస్పీ సైదానాయక్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో మంగళవారం ‘జాతీయ ఐక్యత మార్చ్’ను నిర్వహించారు. జిల్లా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులు, ప్రభుత్వ అధికారులు, కళాశాలల యాజమాన్యా లు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని ఎంఆర్‌హెచ్‌ఎస్ మైదానంలో డీఎస్పీ సైదానాయక్ జెండా ఊపి మార్చ్‌ను ప్రారంభించారు. మార్చ్ ప్రధాన రహదారి గుండా పట్టణంలోని బాగారెడ్డి స్టేడియం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... సర్దార్ పటేల్ వారసత్వాన్ని గౌరవిస్తూ, దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యుజవన అధికారి రంజిత్‌రెడ్డి, డీఏఓ వంశీ, రూరల్ సీఐ హన్మంత్‌నాయక్, ఎస్‌ఐ వినయ్‌కుమార్, ఆచార్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హరికుమార్, ఎంఈఓ మాణయ్య తదితరులు పాల్గొన్నారు.


