చోరీ నిందితుడు అరెస్ట్
గజ్వేల్‌రూరల్: ఎలక్ట్రిక్ వాహనాల సంబంధించిన బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో గజ్వేల్ సీఐ రవికుమార్ కేసు విరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోని కార్తికేయ ఇ – వెహికల్స్ గోదాం ఇన్‌చార్జిగా రాయపోల్ మండలం పెద్ద ఆరెపల్లి గ్రామానికి చెందిన విక్రమ్‌గౌడ్ పనిచేస్తున్నాడు. ఇటీవల గోదాంలో నుంచి బ్యాటరీలు చోరీకి గురవుతున్నాయని కార్తికేయ వెహికల్స్ యజమాని మహిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గజ్వేల్ ఏసీపీ నరసింహులు పర్యవేక్షణలో గజ్వేల్ సీఐ రవికుమార్, డిటెక్టివ్ సీఐ ముత్యంరాజు, ఏఎస్‌ఐ యాదగిరి, సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా కేసును ఛేదించారు. ఈ సందర్భంగా చోరీకి పాల్పడిన వ్యక్తి విక్రమ్‌గౌడ్ నుంచి రూ. 85వేల నగదు, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన రాయవరం గ్రామానికి చెందిన వెంకటేశంతో పాటు మరో వ్యక్తి శేషుల నుంచి రూ. 65వేల నగదు, మొత్తం 25 బ్యాటరీలు, మరో వ్యక్తి నుంచి రూ. 35వేలను స్వాధీనం చేసుకున్నారు. వారిని అ దుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఏసీపీ నరసింహులు అభినందించారు.


