మద్యం రహిత సమాజమే లక్ష్యం కావాలి
ఎకై ్సజ్ అధికారులకు రఘునందన్ హితబోధ
పటాన్‌చెరు: మద్యం రహిత సమాజ నిర్మాణానికి అధికారులు కృషి చేయాలని మెదక్ ఎంపి రఘునందన్ రావు పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో రోజురోజుకి యువత డ్రగ్స్ ,గంజాయి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతగా పనిచేసి, మత్తు రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మెదక్ డిప్యూటీ కమిషనర్ ఎకై ్సజ్ హరికిషన్, జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు, అసిస్టెంట్ సూపరెంటెండెంట్ ఎకై ్సజ్ మణెమ్మ, ఎకై ్సజ్ సీఐ పరమేశ్వర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానంద్, బీజేపీ మండల అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.
స్ఫూర్తిని రగిలించిన వందేమాతర గీతం
పటాన్‌చెరు టౌన్: స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలందరినీ ఏకతాటి పైకి తెచ్చింది వందేమాతర గీతం అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని విద్యా భారతి పాఠశాలలో నిర్వహించిన వందేమాతర గీతాలాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరితో కలిసి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


