కబ్జా భూములను కాపాడండి
కలెక్టర్‌కు సీపీఎం నేతల వినతి
పటాన్‌చెరు: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలో కబ్జాలకు గురవుతున్న భూమిని కాపాడి పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్, కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం గ్రామంలో భూసేకరణ చేసిందని, ఎకరాకు రూ.15.70 లక్ష లు నష్టపరిహారం ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ అనేక మంది రైతులకు ఇంకా నష్టపరిహారం అందలేదన్నారు.కార్యక్రమంలో సాయిలు, జంగయ్య, నాగభూషణ, మహిళలు పాల్గొన్నారు.


