టీసీఏ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
మాట్లాడుతున్న టీసీఏ ప్రతినిధులు
గజ్వేల్‌రూరల్: టీసీఏ(తెలంగాణ క్రికెట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ గోల్డ్‌కప్ కప్ 2025– టీ20 క్రికెట్ టోర్నమెంట్‌కు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు టీసీఏ జిల్లా కన్వీనర్ చెందిరెడ్డి, కోఆర్డినేటర్ హరి పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకే సిద్దిపేట జిల్లా జట్టుకు ఎంపికలు చేపడుతున్నట్లు తెలిపారు. టోర్నమెంట్ ఫైనల్ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26న ఉదయం 10గంటలకు సిద్దిపేట మినీస్టేడియంలో, గజ్వేల్‌లోని ఐవోసీ మైదానంలో సెలక్షన్స్ ఉంటాయని తెలిపారు. అన్ని వయసుల క్రీడాకారులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని, వివరాలకు 7780 596892, 9704 626760ను సంప్రదించాలని సూచించారు.


