కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి..
చేగుంట(తూప్రాన్): కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మక్కరాజీపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... సిద్దిపేటకు చెందిన మహ్మద్ హర్షద్(40) అత్తగారి గ్రామ మైన చేగుంట మండలం మక్కరాజీపేటలో నివాసం ఉంటూ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామ శివారులోని చాన్కన్‌కుంట వద్ద కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి కాలు జారి నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య తాహెరా బేగం ఫిర్యా దు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.
కుంటలో మునిగి వ్యక్తి మృతి


