పురాతన రాతి నూనె గానుగలు
మిరుదొడ్డి(దుబ్బాక): పురాతన శాసన ఆనవాళ్ల ద్వారా నాటి గ్రామ విధి విధానాలను తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదే కోవలో పురాతన కాలం నాటిదిగా చెప్పబడుతున్న రాతి నూనె గానుగ మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని బొమ్మరాజు చెరువు ఆయకట్టులో వెలుగు చూసింది. పురాతన కాలంలో రాతి, సున్నం, చెరుకు రసం గానుగలు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. రాతి గానుగలను ఆడించే వారిని గానుగల వారనీ, తైలీకులనీ, గాండ్ల వారని పిలిచేవారని నానుడి. ఇలాంటి నూనె గానుగలు జిల్లాలోని నంగునూరు, కొండపాకలో దర్శనమివ్వడం విశేషం. ఈ గానుగలు గ్రామీణ ప్రాంతాల్లో 50 ఏళ్ల క్రితం వరకు వినియోగంలో ఉండేవనీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇవి కనుమరుగైపోయినట్లు తెలంగాణ ఔత్సాహిక చరిత్ర కారులు కొలనుపాక శ్రీనివాస్ పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి
పురాతన రాతి నూనె గానుగలు
పురాతన రాతి నూనె గానుగలు


