ఆరుగురు బైండోవర్
అక్కన్నపేట(హుస్నాబాద్): అనుమతులు లేకుండా గ్రామాల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులను సోమవారం తహసీల్దార్ సింహాచలం మధుసూదన్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆరుగురు బెల్ట్ షాపు దుకాణదారులను బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. తిరిగి బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ.లక్ష జరిమానతో పాటు కేసుల పాలవుతారని హెచ్చరించారు.
ఇద్దరిపై కేసు నమోదు
మునిపల్లి(అందోల్): ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుదేరా ఎస్‌ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... సోమవారం కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బీదర్ నుంచి హైదరాబాద్‌కు యాక్టీవాపై ఇద్దరు వ్యక్తులు 115 గ్రాముల ఎండు గంజాయిని తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని చింతల్ విజయనగర్ కాలనీకి చెందిన దేవరకొండ నాని, చింతల్ ద్వారకానగర్‌కు చెందిన పల్లి సాయి పవన్ బీదర్ ఇరానీ గల్లీలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తక్కువ ధరకు 115 గ్రాముల ఎండు గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, యాక్టీవాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వాహన తనిఖీల్లో పోలీస్ కానిస్టేబుల్ హనీఫ్, సంతోష్, డ్రైవర్ అహ్మద్ పాషా ఉన్నారు.
గజ్వేల్‌రూరల్: మార్కెట్‌లో తప్పిపోయిన ఓ చిన్నారిని పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన సోమవారం గజ్వేల్‌లో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ వివరాల ప్రకారం... మండలంలోని కొల్గూరు గ్రామానికి చెందిన ముత్యాల వినయ్‌కుమార్ దంపతులు కూతురు మనస్విని(4)తో కలిసి సోమవారం సాయంత్రం గజ్వేల్‌లోని మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి తప్పిపోవడంతో తండ్రి 100కు డయల్‌చేశాడు. సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో బ్లూకోల్ట్ సిబ్బంది కృష్ణ, కరుణాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారి ఆచూకీని గుర్తించారు. అనంతరం వినయ్‌కుమార్ దంపతులకు అప్పగించారు.
ఆరుగురు బైండోవర్


