లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
కరాటే కిక్స్‌లో సత్తా చాటిన దుబ్బాక విద్యార్థులు
దుబ్బాకటౌన్: కరాటే కిక్స్‌లో సత్తా చాటి.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దుబ్బాక విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు చాలెంజ్ నిర్వహించారు. ఈ మేరకు యువ స్సోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు, మాస్టర్ కరాటే శ్రీకాంత్ సోమవారం వివరాలు వెల్లడించారు. 1200 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని గతంలో ఉన్న రికార్డ్‌ను బద్ధలు కొట్టి 8 లక్షల 50 వేల కిక్స్ నమోదు చేశారని తెలిపారు. ఇందులో విద్యార్థులు లక్షిత, లోకేశ్, నిశాల్, హర్షవర్ధన్, శ్రీహన్స్ ఉన్నారు. విద్యార్థులు, కరాటే మాస్టర్‌ను తైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి అభినందించారు.


