గుర్తు తెలియని వ్యక్తులు మృతి
సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి పట్టణంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన పట్టణ పోలీస్ స్టేషన్ ఫరిధిలో చోటుచేసుకుంది. సీఐ రాము నాయుడు వివరాల ప్రకారం... ఈ నెల 23న ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.
మరో సంఘటనలో...
ఈ నెల 24న ఉదయం 9గంటల సమయంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో గల దుకాణాల్లో భిక్షాటన చేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడి వయసు 45 నుంచి 55 ఏళ్ల వరకు ఉంటాయని తెలిపారు. సెక్యూరిటీ గార్డ్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులు మృతి


