అంతర్జాతీయ కరాటేలో చాంపియన్‌షిప్
మెదక్ మున్సిపాలిటీ: ముంబైలోని అంధేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం జరిగిన 4వ ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో మెదక్ జిల్లా విద్యార్థిని ఓవరాల్ చాంపియన్‌షిప్ సాఽధించింది. కరాటే మాస్టర్ రెంజుకి షోటోకాన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షుడు నగేశ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి చెందిన నితన్యసిరి నేత పాల్గొని కటాస్ విభాగంలో గోల్డ్, నాన్ చాక్ విభాగంలో గోల్డ్‌తో పాటు చాంపియన్‌షిప్ కై వసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో నవీన్ మాస్టర్, దినకర్ టోర్నమెంట్ ఆర్గనైజర్ షిహన్ సజీద్ రైన్ పాల్గొన్నారు.


