వేసవికి వెయ్యి మెగావాట్లు
ఈసారి భారీగా పెరగనున్న విద్యుత్‌లోడ్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రానున్న వేసవిలో జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగనున్నట్లు ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. గతేడాది వేసవి కాలం కంటే సుమారు 25% వరకు విద్యుత్ లోడ్ పెరుగుతుందని అంచనా వేశారు. గతేడాది అత్యధికంగా విద్యుత్‌లోడు 837 మెగావాట్లకు చేరింది. అయితే ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలుండటంతో ఏకంగా వెయ్యి మెగావాట్లకు ఈ లోడ్ చేరుకుంటుందని భావిస్తున్నారు. సాధారణంగా లోడ్ పెరిగితే విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలే ర్పడతాయి. ఒక్కోసారి సబ్‌స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ సబ్‌స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలు, పట్టణ ప్రాంతాలన్నింటికీ సరఫరా నిలిచిపోయే అవకాశముంటుంది. వేసవిలో అధిక లోడ్ కారణంగా తలెత్తే సమస్యలను అధిగమించేందుకు విద్యుత్‌శాఖ సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. రూ.157 కోట్లతో ఈ ప్రణాళికకు ఎన్‌పీడీసీఎల్ ఆమోద ముద్ర వేసింది.
నెలలో ఐదు 33/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం
వేసవిలో ఎక్కువగా ఏసీలు, కూలర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. పల్లెల్లో కంటే పట్టణాల్లో వీటి వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో పట్టణాల్లో విద్యుత్ లోడ్ పెరిగి తరచూ సరఫరాలో అంతరాయం వస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఐదు 33 /11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ఈ నెలలోగా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆందోల్, తెల్లాపూర్, ఆరుట్ల, పోచారం, లక్డారంలో ఈ ఐదు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి నెల రోజుల్లో పూర్తి చేసి అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టారు.
నాలుగు కొత్త ఫీడర్లు..
విద్యుత్ సరఫరా చేసే విద్యుత్‌లైన్ తెగిపోతే సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ప్రత్యామ్నాయ ఫీడర్లు ఉంటే ఒక లైన్ తెగిపోయినా, ప్రత్యామ్నాయ లైన్ ద్వారా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుంటుంది. ఇలా 33 కేవీ సామర్థ్యం కలిగిన నాలుగు ప్రత్యామ్నాయ ఫీడర్లను నిర్మిస్తోంది. వేసవి ప్రారంభంలోగా ఈ లైన్లను అందుబాటులోకి తేవాలని ఆశాఖ భావిస్తోంది. వీటితోపాటు 29 పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు వంటి చర్యలు చేపట్టారు.
పెరగనున్న
బోర్ల వినియోగానికి సరిపడా..
జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పంటలకు నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా వరికి చివరి తడి పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రైతులు బోర్లు ఎక్కువగా నడుపుతారు. పంటను కాపాడుకునేందుకు బోరు నీరే ఆధారం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యుత్‌లోడ్ పెరుగుతుంది. ఇటు పట్టణాల్లో గృహ అవసరాల లోడుతోపాటు, గ్రామాల్లో బోర్ల లోడ్ తోడవడంతో ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్లపై అధికభారం డుతుంది. ఈ లోడ్‌ను తట్టుకునేలా ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యుత్‌శాఖ ఆరు సబ్‌స్టేషన్లను నిర్మిస్తోంది. ఈ ఆరు సబ్‌స్టేషన్లు జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్న
విద్యుత్‌శాఖ
రూ.157 కోట్లతో
సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం
జిల్లాలో 11 చోట్ల కొత్తగా
33/11 కేవీ సబ్‌స్టేషన్లు
నాలుగు ప్రత్యామ్నాయ ఫీడర్ల నిర్మాణం
పకడ్బందీగా సమ్మర్ యాక్షన్‌ప్లాన్ అమలు
ఎండాకాలంలో ఎలాంటి అంతరాయం 24 గంటలు విద్యుత్ సరఫరా జరిగేలా ముందస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం. పెరగననున్న విద్యుత్ లోడ్‌కు తట్టుకునేందుకు అవసరమైన సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ మేరకు రూ.157 కోట్లతో పనులు చేపట్టాము. ఈ పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
– కామేశ్, చీఫ్ ఇంజనీర్, సంగారెడ్డి సర్కిల్
వేసవికి వెయ్యి మెగావాట్లు


