సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు
సంగారెడ్డి జోన్: భక్తి భావంతో పాటు సేవాభావాన్ని పెంపొందించిన సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఖాసీం బేగ్, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు
కాంగ్రెస్ కృషి: ఎంపీ షెట్కార్
జహీరాబాద్ టౌన్: మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ.సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఆదివారం సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డితో కలిసి మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే లక్ష్యంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డులు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, చీరలు తదితర పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వారు మహిళలతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తన్వీర్,హన్మంత్‌రావు,శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ, ఆర్డీఓ,డీపీఎం,ఏపీఎం తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థికి దుప్పట్లు,
బెడ్‌షీట్లు పంపిణీ
మానవత్వం చాటుకున్న
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి
మెదక్ కలెక్టరేట్: తెలంగాణ ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్ (టీఏసీసీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాముని రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజేశ్వర్ ప్రస్తుతం మెదక్ జిల్లా జనరల్ ప్రభుత్వాసుపత్రిలో ఎయిడ్స్ కౌన్సిలర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో టీఏసీసీయూ జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కమిటీలో పనిచేశారు. రాజేశ్వర్ ఎన్నిక పట్ల ఆదివారం టీజీఓ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్‌గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు
సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు
సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు


