బోనమెత్తిన భక్తిధాం తండా
వైభవంగా
శివపార్వతుల కల్యాణం
కల్హేర్(నారాయణఖేడ్): నిజాంపేట మండలం
బల్కంచెల్క(భక్తిధాం) తండాలో శ్రీవిశ్వపాలిని భవానీ సమేత సేవాలాల్ మహరాజ్ మహామందిరంలో ఆదివారం ఘనంగా బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రవాణ శాఖ డిప్యూటీ కమిషనర్, మందిరం ధర్మకర్త మూడ్ కిషన్‌సింగ్–లలితబాయి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కల్యాణానికి కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహరాజ్, ఎరక్‌పల్లికి చెందిన దేవీదాస్ మహారాజు, మందిరం పురోహితులు మనోజ్‌శర్మ హాజరై లలితా సహస్రనామ కుంకుమార్చన, మహాఅన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో తండా ప్రముఖులు శంకర్, ఖాట్రోత్ జైల్‌సింగ్, రాములు తదితరులు పాల్గొన్నారు.


