పారిశ్రామికానికి ప్రోత్సాహం
అక్కన్నపేట(హుస్నాబాద్): పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడమేకాకుండా మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామ క్రాసింగ్ వద్ద ఏర్పాటవుతున్న ఇండస్ట్రియల్ పార్కులో మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం ఇస్తున్నామన్నారు. అక్కన్నపేటలోని రైతు వేదికలో ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై పలువురు మహిళలకు బొట్టు పెట్టి చీరలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కింద ప్రతీ మహిళకు చీర అందిస్తోందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్


