పనికి వెళ్తే.. ఉసురు తీశారు
జహీరాబాద్ టౌన్: కూలి పనులకు వెళ్లిన మహిళను ట్రాక్టర్ మృత్యురూపంలో కబలించింది. ఈ ఘటన మొగుడంపల్లి మండలంలోని ధనసిరి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. చిరాగ్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం... జహీరాబాద్ పట్టణంలోని హమాలీ కాలనీకి చెందిన మంగలి లక్ష్మి కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. కాగా ధనసిరి గ్రామంలోని సిద్దప్ప పొలంలో చెరకు పంటను కోసే పనులకు వెళ్లింది. ఈ క్రమంలో చెరుకు కటింగ్ పనులు చేస్తుండగా డ్రైవర్ ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా నడుపుతూ ఆమైపె నుంచి తీసుకెళ్లాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. కాగా డ్రైవర్ చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఆమె కేకలు వేసినా అతడికి వినిపించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో మృతి


