సిద్దిపేటలో...
ఐటీ.. నైట్ షిఫ్ట్
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట పట్టణ శివారులో ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌లో నాలుగు కంపెనీల్లో నైట్ షిఫ్ట్‌లలో ఐటీ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. పీపు ల్స్ ప్రేమ్, తోరన్, కల్పన టెక్, అమృత సిస్టమ్ కంపెనీల్లో దాదాపు 80 మంది పని చేస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు విధులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 2.40గంటలకు బ్రేక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు అందరు టీ తాగుతున్నారు.
చలిలోనే విధులు
పట్టణం అంతా నిద్రలో ఉండగానే పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తున్నారు. మెదక్ రోడ్‌లో లలిత , రాజమణి ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు చలికి వణుకుతూ రోడ్లను ఊడుస్తున్నారు. ఊడ్చిన చెత్తను వెంటనే ఆటోలో వేస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంటకు పట్టణంలోని సుభాష్ రోడ్‌లో ఓ షాపింగ్ మాల్ వద్ద సెక్యూరిటీ గార్డులు శ్రీనివాస్, రమేశ్ చలి, దోమల నుంచి రక్షణ పొందేందుకు కొబ్బరి పీసుతో పొగ పెట్టారు. ఇలా పొట్ట కూటి కోసం ఎముకలు కొరికే చలిలో సైతం విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి హైదరాబాద్, కరీంనగర్‌కు వెళ్లే ప్రయాణికులు చలి ఎక్కువగా ఉండటంతో పొన్నాల సమీపంలోని కింగ్ ప్యాలెస్ వద్ద గరం గరం చాయ్ తాగారు.


