క్రీడల్లో రాణించాలి
మెదక్‌జోన్: క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో రాణించాలని డీఈఓ విజయ పేర్కొన్నారు. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఎజీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 బాల ,బాలికలు ఖోఖోలో ప్రతిభ కనబర్చిన వారిని ఈనెల 23, నుంచి 25 వరకు యాదాద్రి భువనగిరిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించారు. శనివారం ఇందిరాగాంధీ స్టేడియంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు, యూనిఫాంలను డీఈఓ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో రాణించి, జాతీయస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్ నాగరాజు, పీడీలు ఎ.మాధవరెడ్డి, రూపేందర్, రవి, దేవేందర్ రెడ్డి ఉన్నారు.
డీఈఓ విజయ


