సుపారి గ్యాంగ్ అరెస్ట్
సిద్దిపేటరూరల్: సుపారి తీసుకుని వ్యక్తిని చంపేందుకు ప్రయత్నించిన 8 మంది గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సిద్దిపేట డివిజనల్ ఏసీపీ ఎం.రవీందర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన పోలీస్ శ్రీనివాస్‌రెడ్డి (మాజీ సైనికుడు)కి అదే గ్రామానికి చెందిన పుల్లగూర్ల ఎల్లారెడ్డికి కొంతకాలంగా పొలం దారి విషయంలో భూవివాదాలు జరుగుతున్నాయి. దీంతో విసుగుచెందిన శ్రీనివాస్‌రెడ్డి భూ తగాదాలను మనసులో పెట్టుకుని ఎల్లారెడ్డిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఇర్కోడ్‌కు చెందిన తన బంధువులైన సాగర్, అతని స్నేహితుడు భరత్‌కు చెప్పగా, వారు ఇర్కోడ్‌కు చెందిన పర్శరాములును పరిచయం చేశారు. ఎల్లారెడ్డిని చంపేందుకు పర్శరాములుతో రూ.10లక్షలకు సుపారి మాట్లాడాడు. ఇందుకు శ్రీనివాస్‌రెడ్డి విడతల వారీగా రూ.5లక్షలు ఇచ్చి వాట్సాప్‌లో ఎల్లారెడ్డి ఫొటోను పర్శరాములుకు పంపి, తర్వాత డిలీట్ చేశాడు. హత్య చేయడానికి పర్శరాములు తనకు పరిచయం ఉన్న ఫాజిల్ ద్వారా రెండు నెలల క్రితం రౌడీషీట్ ఉన్న కాస స్వామిని కలిశాడు. పర్శరాములు స్వామికి ఎల్లారెడ్డి ఫొటో పంపి యాక్సిండెంట్ చేసి చంపాలని రూ. 3లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. స్వామి భయనాగా రూ. 10వేలు తీసుకోగా, ఫోన్‌పే, వాట్సాప్ పే ద్వారా రూ. 2లక్షల వరకు స్వామికి పంపించాడు. పరిచయం చేసినందుకు ఫాజిల్‌కు రూ.12వేలు ఇచ్చాడు.
రెండు సార్లు విఫలం..
మూడోసారి ఢీకొట్టారు
8 మంది అరెస్టు.. ఇద్దరు పరారీ
వివరాలు వెల్లడించిన ఏసీపీ


