హరీశ్‌రావుకు జాతర ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

హరీశ్‌రావుకు జాతర ఆహ్వానం

Nov 23 2025 9:26 AM | Updated on Nov 23 2025 9:26 AM

హరీశ్

హరీశ్‌రావుకు జాతర ఆహ్వానం

నారాయణఖేడ్‌: ఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో ఈనెల 30న మైలారం మల్లన్న స్వామి కల్యాణం, జాతర మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఎమ్మెల్యే హరీశ్‌రావును శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పరమేశ్‌, అనంతసాగర్‌ గ్రామ బీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధు, సురేశ్‌గౌడ్‌, రాజు, కోయల రాజు, రిషిలు ఆహ్వానపత్రికను అందజేశారు.

ప్రత్యేక తరగతులు

నిర్వహించాలి

జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి వెంకటేశ్‌

నారాయణఖేడ్‌: టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధి ంచేందుకుగాను ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి వెంకటేశ్‌ సూచించారు. ఖేడ్‌ పట్టణంలోని గిరిజన బాలికల వసతిగృహం, మండలంలోని జూకల్‌ శివారులో ఉన్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులను అడిగి భోజన నాణ్యత, సదుపాయాలు, విద్యాబోధన వివరాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని వసతిగృహం సంక్షేమ అధికారి బాలమణికి సూచించారు.

చెరుకు రైతులకు

రాయితీలు ఇవ్వాలి

జహీరాబాద్‌ సీడీసీ చైర్మన్‌ ముబీన్‌

జహీరాబాద్‌: చెరుకు పంటపై రైతులకు పలు రాయితీలు కల్పించాలని జహీరాబాద్‌ సీడీసీ చైర్మన్‌ ముబీన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి శ్రీధర్‌బాబుకు ఆయన వినతిపత్రం సమర్పించారు. సెక్రటేరియట్‌లో ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, సెట్విన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్‌.గిరిధర్‌రెడ్డి, టీజీఐఐసీ చైర్మన్‌ నిర్మలారెడ్డి సమక్షంలో సీడీసీ చైర్మన్‌ ముబీన్‌ శనివారం మంత్రి శ్రీధర్‌బాబును కలిసి చెరుకు సమస్యల గురించి వివరించారు. చెరుకు పంటకు ప్రస్తుత కర్మాగారాలిస్తున్న ధర ఏ మాత్రంగి ట్టు బాటుగా లేదని వివరించారు. పెట్టుబడుల వ్యయం భారీగా అవుతోందని, అందుకు అనుగుణంగా చెరుకు పంటకు గిట్టుబాటు ధరను ఇప్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు, గిట్టుబాటు ధర ఇప్పించడంతోపాటు బోనస్‌, ప్రధాన డిమాండ్లను పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు ముబీన్‌ తెలిపారు.

రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌

అవార్డుకు మనిషా

జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల విద్యార్థి మనిషా సిరివి రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ మానాక్‌ అవార్డుకు ఎంపికై ంది. మున్సిపల్‌ పరిధిలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పదోతరగతి చదువుతోంది. మనిషా వృద్ధుల కోసం బరువైన వస్తువులను శారీరక ఒత్తిడి లేకుండా ఎత్తుకునే సులభ యాంత్రిక పద్ధతిలో రూపొందించింది. విద్యార్థిని మేథస్సును గుర్తిస్తూ అవార్డు నిర్వాహకులు రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు పాఠశాల యాజమాన్యం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలే

ఎస్పీ పరితోశ్‌పంకజ్‌

సంగారెడ్డి జోన్‌/కల్హేర్‌ (నారాయణఖేడ్‌): విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ హెచ్చరించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏఆర్‌ పోలీసులకు వారాంతపు పరేడ్‌ నిర్వహించారు. అనంతరం సిర్గాపూర్‌ పోలీస్టేషన్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అధికారులకు ఫిట్‌నెస్‌ కీలకమన్నారు.

హరీశ్‌రావుకు జాతర ఆహ్వానం1
1/1

హరీశ్‌రావుకు జాతర ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement