ఆయిల్‌పామ్‌ సాగుతో ఆర్థిక భరోసా | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగుతో ఆర్థిక భరోసా

Nov 23 2025 9:26 AM | Updated on Nov 23 2025 9:26 AM

ఆయిల్‌పామ్‌ సాగుతో ఆర్థిక భరోసా

ఆయిల్‌పామ్‌ సాగుతో ఆర్థిక భరోసా

జహీరాబాద్‌ టౌన్‌: ఆయిల్‌పామ్‌ సాగుతో నిరంతర సుస్థిర ఆదాయం లభిస్తుందని రైతుల ఆ పంట సాగుకు ముందుకురావాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. మండలంలోని రంజోల్‌ బాబానగర్‌లో సత్యనారాయణ పొలంలో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆయిల్‌పామ్‌ మొక్కలను ఒక్కసారినాటితే 40 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. ఆయిల్‌పామ్‌ సాగు కోసం ఎకరాకు రూ.51 వేల చొప్పున నాలుగేళ్ల పాటు సబ్సిడీ అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయిల్‌పామ్‌ మొక్కలను నాటారు.

ఎమ్మెల్యే మాణిక్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement