4 లేబర్ కోడ్స్‌ను ఉపసంహరించుకోవాలి
పటాన్‌చెరు టౌన్: నాలుగు లేబర్ కోడ్స్‌ను అమలు చేయడం అత్యంత దుర్మార్గమని కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ అమలును వ్యతిరేకిస్తూ శనివారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాండు రంగారెడ్డి మాట్లాడుతూ...2019–20లో ప్రపంచం మొత్తం కరోనా విపత్తులో ఉన్నపుడు దొడ్డిదారిన మోదీ సర్కారు లేబర్ కోడ్స్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నదన్నారు. కార్మికవర్గం 9 దేశవ్యాప్త సమ్మెల ద్వారా ఈ లేబర్ చట్టాలపై నిరసన తెలియజేసిందని గుర్తు చేశారు. ఈ లేబర్ కోడ్స్ పూర్తిగా యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు, శ్రమ దోపి డీ చేయడానికి ఉపయోగపడతాయన్నారు.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి


