
పేదరికం జయించి.. కొలువులు సాధించి
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా..
మాది కరీంనగర్ జిల్లా చొప్పదండి నాన్న బీరయ్య, అమ్మ భూదవ్వ. వ్యవసాయం చేసుకుంటూ నన్ను చదివించారు. అమ్మానాన్నలు, భర్త మహేష్ నా ఎస్‌ఐ కల నెరవేరడానికి ఎంతగానో ప్రోత్సహించారు. ప్రస్తుతం కొత్తగా మిరుదొడ్డి ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది.
– సమత, మిరుదొడ్డి, ఎస్‌ఐ
రెక్కాడితే గాని డొక్కాడని పేద, వ్యవసాయ ,కూలీ కుటుంబాల పిల్లలు వీరూ..అయితేనేం చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. ఓ వైపు తల్లిదండ్రులతో పాటు వ్యవసాయం, కూలి పనులు చేస్తూనే కష్టపడి చదువుకొని ఎస్‌ఐలుగా జాబ్‌లు సాధించారు. 21 నెలలు వివిధ అంశాలపై శిక్షణ తీసుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ స్టేషన్లలో బాధ్యతలు తీసుకున్న యువ ఎస్‌ఐలు, వారి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల కష్టం, తదితర అంశాలపై సాక్షి ప్రత్యేక కథనం.
– దుబ్బాక/దుబ్బాకటౌన్:
అంతా వ్యవసాయ, పేద, కూలీ కుటుంబాలే..
● ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్‌ఐలుగా బాధ్యతలు
● కడు దయనీయ కుటుంబాల నుంచి వచ్చిన మహిళా ఎస్‌ఐలు
● తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం వీరు
● కష్టపడి చదివి ఎస్‌ఐ జాబ్‌లు కొట్టారు