
విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ అందజేత
దాత అందజేసిన స్పోర్ట్స్ డ్రెస్‌లతో విద్యార్థులు
శివ్వంపేట(నర్సాపూర్): ప్రభుత్వ పాఠశాలల అభివృద్థికి కృషి చేస్తున్న దాతల సహాయం వెలకట్టలేనిదని హెచ్‌ఎం ఇందుమతి అన్నారు. మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల ఉన్నత పాఠశాలలోని 400 మంది విద్యార్థులకు హైదరాబాద్‌కు చెందిన హరికిషన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు శనివారం స్పోర్ట్స్ డ్రెస్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. మరిన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ అందించాలని హెచ్‌ఎం కోరగా వారు.. సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.