
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు
మెదక్‌జోన్: తెలంగాణ స్టేట్ లెవల్ 11వ జూనియర్స్, సీనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అండర్ 14, 16, 18, 20 పోటీల్లో 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 40 మంది రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మధుసూదన్ తెలిపారు. పట్టణంలోని ఇందిరాగాంధీ (అథ్లెటిక్)స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కాగా వీటిలో జేమ్స్, త్రోస్, తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరు ఆగస్టు 3,4వ తేదీల్లో వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, టీఎన్‌జీవో అధ్యక్షుడు నరేందర్, పీఈటీల సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు పతకాలు అందజేశారు.