
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
కాంగ్రెస్ నేత
నీలం మధు ముదిరాజ్
పటాన్‌చెరు టౌన్: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లో పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సీఎం సహాయనిధి ఆపత్కాలంలో అండగా నిలిచి ఆదుకుంటుందన్నారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. సుమారు రూ. వెయ్యి కోట్లకుపైగా నిధులను సీఎంఆర్‌ఎఫ్ కోసం వెచ్చించిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్: మండలంలోని డోవూరుకు చెందిన బస్లంగొండకు రూ.60 వేలు, కంగ్టి మండలం ఘన్‌పూర్‌కు చెందిన సావిత్రికి రూ.16,500 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరయ్యాయి. బుధవారం ఈ చెక్కులను ఖేడ్‌లో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి లబ్ధిదారుల కుటుంబీకులకు అందజేశారు. మనూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకాష్‌రావు, నాయకులు రాములు, రాజు పాల్గొన్నారు.