540 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం | Sakshi
Sakshi News home page

540 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

Published Wed, Apr 17 2024 8:20 AM

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ బాలస్వామి - Sakshi

అల్లాదుర్గం(మెదక్‌): రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది రెక్కి నిర్వహించి పట్టుకున్నారు. మంగళవారం అల్లాదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ డాక్టర్‌ బాలస్వామి విలేకర్ల సమావేశం నిర్వహించారు. నాలుగు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 540 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఐచర్‌ వాహనంలో 106 క్వింటాళ్లు, డీసీఎం వ్యాన్‌లో 138 క్వింటాళ్లు, లారీలో 258 క్వింటాళ్లు, బొలెరోలో 40 క్వింటాళ్లు ఉన్నట్లు గుర్తించారు. నాలుగు వాహనాలను సీజ్‌ చేశారు. నలుగురు డ్రైవర్లు సాయి విక్రమ్‌, బస్వరాజ్‌, బాలయ్య, జయ్‌రాంలను అదుపులోకి తీసుకున్నారు. ఈ రేషన్‌ బియ్యం రైస్‌ మిల్లు యాజమానికి అమ్మడానికి తెచ్చినట్లు విచారణలో తెలిపారు. విలువ రూ.10.80 లక్షలు ఉంటుంది. అయితే రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొని అధిక ధరకు రైస్‌ మిల్లులకు అమ్ముతున్నారు. డబ్బు సంపాదనే ఉద్దేశంతో ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే ఈ బియ్యాన్ని మెదక్‌ డీఎస్‌ఓకు అప్పగిస్తామని ఎస్పీ తెలిపారు. అక్రమ రవాణపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మెదక్‌ డీఎస్పీ రాజేశ్‌, సీఐ రేణుక, ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గడిపెద్దాపూర్‌ వద్ద పట్టివేత

విలువ రూ. 10.80 లక్షలు

నలుగురిపై కేసు నమోదు

మెదక్‌ ఎస్పీ బాలస్వామి

Advertisement
 
Advertisement