ఖర్చును నిశితంగా పరిశీలించాలి | Sakshi
Sakshi News home page

ఖర్చును నిశితంగా పరిశీలించాలి

Published Thu, Nov 23 2023 4:32 AM

మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక 
వ్యయ పరిశీలకుడు బాలకృష్ణన్‌ - Sakshi

రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకుడు బాలకృష్ణన్‌

సంగారెడ్డి టౌన్‌: జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకుడు బాలకృష్ణన్‌ అన్నారు. బుధవారం జిల్లాకు విచ్చేసిన ఆయన కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు జయకర్‌, విజయ్‌కృష్ణ వేలాను, అదనపు కలెక్టర్లు, ఎక్స్‌పెండిచర్‌, ఎంసీసీ, ఎంసీఎండీ నోడల్‌ అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులతో సమావేశమై, ఎన్నికల ఖర్చులు, బ్యాంకు లావాదేవీలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు, ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను మరింత నిశితంగా పరిశీలించాలన్నారు. బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా మద్యం, డబ్బు, బహుమతుల పంపిణీ తదితరాల అంశాలపై గట్టి నిఘా పెట్టాలని సూచించారు. ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌, రాష్ట్ర వ్యయ ప్రత్యేక పరిశీలకులకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 102 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఇందుకు 1609 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్‌ స్లిప్పుల పంపిణీ 98 శాతం పూర్తయిందన్నారు. తనిఖీలు, శాంతి భద్రతలకు తీసుకుంటున్న చర్యలు, బందోబస్తు వివరాలు ఎస్పీ రూపేష్‌ వివరించారు. ముందుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయ సముదాయంలో ఏర్పాటు చేసిన ఎంసీసీ, ఎంసీఎంసీ, సీవిజిల్‌, గ్రీవెన్స్‌ కేంద్రం, కంట్రోల్‌ రూమ్‌లను సందర్శించారు. సమీక్షలో ఎకై ్సజ్‌, ఇన్‌ కంటాక్స్‌, జీఎస్టీ అధికారులు, ఎల్‌డీఎం, సంబంధిత నోడల్‌ అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఎన్నికల

నిర్వహణ ఏర్పాట్లు

శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఈసీఐ సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీశ్‌కుమార్‌ వ్యాస్‌ జిల్లాల ఎన్నికల అధికారులకు సూచించారు. బుధవారం న్యూఢిల్లీ నుంచి జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పోలింగ్‌ నిర్వహణకు చేపట్టిన చర్యల గురించి జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్‌, మాధురి, ఏఓ పరమేష్‌, ఎన్‌ఐసీ అధికారి విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement