పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

Published Wed, Nov 22 2023 4:26 AM

సిరా గుర్తును చూపిస్తున్న ఎన్నికల సిబ్బంది  - Sakshi

సంగారెడ్డి: పట్టణంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ మంగళవారం నిర్వహించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్‌ఓ రవీంద్రారెడ్డి ఈ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.

పటాన్‌చెరు టౌన్‌: ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. పోస్టల్‌ బ్యాలెట్‌ను 231 మంది వినియోగించుకున్నారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దేవుజా తెలిపారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 230 మంది, మెదక్‌ జిల్లా నుంచి ఒకరు ఉన్నారని పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది కోసం ఈనెల 26, 27, 28వ తేదీల్లోనూ పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement