ఖైదీల సంస్కరణకే ‘సంకల్ప’ | Sakshi
Sakshi News home page

ఖైదీల సంస్కరణకే ‘సంకల్ప’

Published Wed, Nov 15 2023 4:32 AM

ఖైదీకి  సర్టిఫికెట్‌ను అందజేస్తున్న మురళీబాబు  - Sakshi

జైళ్ల శాఖ ఐజీ మురళీబాబు

సంగారెడ్డి టౌన్‌: వృత్తి నైపుణ్యంతో ఖైదీలు ఉపాధి పొందవచ్చని జైళ్ల శాఖ ఐజీ మురళీబాబు అన్నారు. సంగారెడ్డి కంది జైలులో నెలరోజులుగా జరుగుతున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ముగింపు రోజైన మంగళవారం ఖైదీలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిమాండ్‌ ముద్దాయిల సంస్కరణ కోసం.. వారు వృత్తి నైపుణ్యం, ఉద్యోగం సాధించే దిశగా జైళ్ల శాఖ పలు విభాగాల్లో శిక్షణ ఇస్తోందన్నారు. విడుదలైన వారు నేరాల బాట పట్టకుండా, మంచి మార్గంలో నిపుణులుగా స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ తరహా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవా లన్నారు. సంకల్ప ప్రోగ్రాంలో భాగంగా జిల్లా స్కిల్‌ కమిటీ ఆధ్వర్యంలో 30 రిమాండ్‌, అండర్‌ ట్రయిల్‌ ఖైదీలకు ఎలక్ట్రిషీయన్‌, హౌస్‌ వైరింగ్‌లపై శిక్షణ ఇచ్చామన్నారు. అందుకు సహకరించిన న్యాక్‌కు, నాబార్డును అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ భరత్‌రెడ్డి, న్యాక్‌ డైరెక్టర్‌ సత్యపాల్‌ రెడ్డి, నాబార్డ్‌ ఏజీఎం సెసిల్‌, మేనేజర్‌ కృష్ణతేజ, జిల్లా ఉపాధి కల్పన అధికారి వందన, సీడ్‌ ఎన్‌జీఓ ప్రతినిధులు, సిబ్బంది ఖైదీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement