రూ.లక్ష రుణమాఫీ ఏమైంది? | Sakshi
Sakshi News home page

రూ.లక్ష రుణమాఫీ ఏమైంది?

Published Tue, Nov 14 2023 4:22 AM

ప్రచార రథాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగిన రైతులు - Sakshi

నంగునూరు(సిద్దిపేట): లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఐదేళ్లు గడిచినా అమలు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచార రథాన్ని రైతులు అడ్డుకున్నారు. ఈ సంఘటన సోమవారం నంగునూరు మండలం వెంకటాపూర్‌లో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార రథంతో గ్రామానికి చేరుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులను అదే పార్టీకి చెందిన రైతులు అడ్డుకుని లక్ష రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీశారు. రుణమాఫీ చేయకుండా.. ఇప్పుడు ఓట్ల కోసం ఎందుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఒకే కుటుంబంలో నలుగురికి బీసీ బంధు ఇచ్చారని, మేము అర్హులం కాదా అని నిలదీయంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజగోపాల్‌పేట ఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఎన్నికల ప్రచారానికి వచ్చే పార్టీలను అడ్డుకోవద్దని రైతులకు నచ్చజెప్పారు.

బీఆర్‌ఎస్‌ ప్రచార రథాన్ని అడ్డుకున్న రైతులు

 
Advertisement
 
Advertisement