పేకాటరాయుళ్ల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

పేకాటరాయుళ్ల అరెస్టు

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

పేకాటరాయుళ్ల అరెస్టు ఎయిర్‌పోర్టులో గంజాయి పట్టివేత ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొన్న కారు

యాలాల: గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ముగ్గురిని యాలాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల శివారులోని ఫర్దే కుంట వద్ద పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సంగెంకుర్దు గ్రామానికి చెందిన ఊరిబైటి రాజు, అల్లకోటి విష్ణు, మీదికేరి వెంకటయ్య పేకాట ఆడుతున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2,800 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికుడి నుంచి 10 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గురువారం బ్యాంకాక్‌ నుంచి వచ్చిన విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన మితేష్‌కుమార్‌ కదలికలను అనుమానించిన కస్టమ్స్‌, ఇంటలిజెన్స్‌ అధికారులు అతడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బ్యాగు చివర అడుగు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాగ్‌లో 10 కేజీల హైడ్రోపోనిక్‌ గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ. 6 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారం న్యాయస్థానం ముందు హాజరుపర్చినట్లు వెల్లడించారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

రాజేంద్రనగర్‌ : ఔటర్‌పై ఆగి ఉన్న వాహనాన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. రాజేంద్రనగర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. భవానీ కాలనీకి చెందిన ప్రభాత్‌ కుమార్‌ జా (37) గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కారులో రాజేంద్రనగర్‌ ఓఆర్‌ఆర్‌ గుండా గచ్చిబౌలిలోని కార్యాలయానికి వెళుతున్నాడు. ఎగ్జిట్‌ 17 నుంచి వెళ్లిన ఆయన ఎగ్జిట్‌ 18 వద్ద పార్కింగ్‌ ప్లేస్‌ లో ఆగి ఉన్న భారీ కంటైనర్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టాడు. దీంతో కంటైనర్‌ కిందకు కారు చొచ్చుకు వెళ్ళింది. తీవ్రంగా గాయపడ్డ జా అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement