గ్లోబల్ సమ్మిట్‌ను సందర్శించేలా చూడండి
సాక్షి, సిటీ బ్యూరో: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సదస్సులో ప్రదర్శిస్తున్న అన్ని అంశాల పై యువత అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ జి.ముకుంద రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌ను విద్యార్థులు, యువతకు తిలకించే విధంగా అవగాహన కల్పించేందుకు చేపట్టవలసిన చర్యలపై వివరించారు. ఈ నెల 10 నుండి 13 వరకు సందర్శించేందుకు ప్రభుత్వం అవ కాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులను సమకూర్చుతున్నామని తెలిపారు. నోడల్ అధికారులను, కాలేజీలవారీగా ఇన్‌చార్జీ అధికారులను నియమిస్తునట్లు ఆయన తెలిపారు. సంక్షేమ శాఖ అధికారులు కోటాజి, ఆశన్న ,డీఎం పరిశ్రమల శాఖ ప్రవీణ్, విద్యా శాఖ అధికారి రోహిణి, ఆర్టీసీ ఆర్‌ఎం సుచరిత తదితరులు పాల్గొన్నారు.


