ప్రపంచానికి తెలంగాణ ఘనత
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ మహేశ్వరం నియోజకవర్గంలో జరగడం మన అదృష్టంగా భావిస్తున్నట్లు కేఎల్‌ఆర్ ఇండస్ట్రీస్ అధినేత, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ అన్నారు. సోమవారం ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఘనతను ప్రపంచానికి చాటేలా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచంలోని పెట్టుబడిదారులకు సందేశం ఇచ్చినట్లయిందన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతాల్లో ఇకపై తెలంగాణ ముందు నిలుస్తుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్


