ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి అదృశ్యం
పహాడీషరీఫ్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి ప్రాంతానికి చెందిన దుర్గా భవానికి, ఏడాదిన్నర క్రితం పినిశెట్టి రాజేశ్‌కుమార్(35)తో వివాహం జరిగింది. వీరు జల్‌పల్లిలోని శ్రీరాం కాలనీలో నివాసం ఉంటున్నారు. చిట్‌ఫండ్ వ్యాపారం చేసే రాజేశ్‌కుమార్‌కు డబ్బులు ఇచ్చే వారు సకాలంలో ఇవ్వకపోవడంతో, చిట్టీ ఎత్తిన వారికి సమయానికి నగదు ఇవ్వలేక ఒత్తిడికి గురవుతున్నాడు. ఇతని భార్య పురుడు పోసుకునేందుకు పుట్టింటికి వెళ్లగా, బావమరిది దూసనపూడి వెంకటేశ్ కొంతకాలంగా బావతో కలిసి ఉంటున్నాడు. ఇదిలా ఉండగా నవంబర్ 29న శ్రీశైలం వెళ్లి వస్తానని బావమరిదికి చెప్పి వెళ్లిన అతడు ఎంతకీ తిరిగి రాలేదు. ఒత్తిడి భరించలేకే ఎక్కడికో వెళ్లిపోయి ఉంటాడని భావించిన వెంకటేశ్ సోమవారం పహాడీషరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌లో లేదా, 87126 62367 నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.
‘లగచర్ల’ ముద్దాయి సురేశ్ బైండోవర్
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్ల గ్రామానికి చెందిన బోగమోని సురేశ్‌ను సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేశారు. లగచర్ల ఘటనలో ఏ–2 ముద్దాయిగా ఉన్న సురేశ్‌ను పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘా తం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని తహసీ ల్దార్ కిషన్, పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో గొడవలు సృష్టించినా, అల్లర్ల కు పాల్పడినా అరెస్టు చేయడంతో పాటు రూ. లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి అదృశ్యం


