
మహిళల అభ్యున్నతికి కృషి చేయాలి
కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో మహిళా సంఘాలకు వంద ఎకరాలు కేటాయించి, వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఇందిర మహిళా శక్తి సంబరాల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కందుకూరు, మహేశ్వరం మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి మహిళలను కోటీశ్వరుల్ని చేస్తానని చెబుతున్నారని, ఒక్కో మహిళకు రూ.కోటి రుణం ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం మాటలతో కడుపు నింపే ప్రయత్నం చేస్తోందని, నిజంగా ఆడబిడ్డలపై ప్రేముంటే మూడేళ్లకాలం వడ్డీని వెంటనే విడుదల చేయాలన్నారు. మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని, బ్యాంక్ లింకేజ్‌తో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని, సీనియర్ సిటిజన్లతో సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ డీపీఎం యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, ఏపీఎంలు కవిత, సత్యనారాయణ, ఎంపీఓ గీత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్‌రెడ్డి, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.