
సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి
మొయినాబాద్: మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్‌లో ఆగస్టు 2న జరిగే సీపీఐ జిల్లా 17వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ నాటి నుంచి నేటి వరకు భూమి, భుక్తి, విముక్తికోసం పేదల పక్షాన పోరాటం చేస్తోందన్నారు. పోరాటమే ఎజెండాగా జరుగనున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు పర్వతాలు, రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం, మండల కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు సత్యనారాయణ, అంజయ్య, మంజుల, సుధాకర్‌గౌడ్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.